RCB 2025: "ఈ సాల కప్ నమ్ ధు" - ఈసారి మనదే! 9 month ago

featured-image

ఐపీఎల్ 2025లో భాగంగా నిన్న ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్ వేదికగా నరేంద్ర మోడీ స్టేడియంలో ఘనంగా జరిగింది. ఫైనల్స్ కు చేరుకున్న ఇరు జట్లు రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు, పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ ఉత్కంఠభరితంగా జరిగింది. మొదట టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ బౌలింగ్ ఎంచుకున్నారు.


తొలుత బ్యాటింగుకు బరిలోకి దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు ఓపెనర్స్ ఫిలిప్ సాల్ట్ 9 బంతుల్లో 16 పరుగులు (2 ఫోరులు, 1 సిక్స్) చేసి ఔటయ్యాడు, విరాట్ కోహ్లీ 35 బంతుల్లో 43 పరుగులు (3 ఫోరులు) చేసి ఔటయ్యాడు, రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్స్ మయాంక్ అగరవాల్ 18 బంతుల్లో 24 పరుగులు (2 ఫోరులు, 1 సిక్స్) చేసి ఔటయ్యాడు, రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు కెప్టెన్ రజత్ పాటిదార్ 16 బంతుల్లో 26 పరుగులు (1 ఫోర్, 2 సిక్స్‌లు) చేసి వెనుదిరిగాడు, లివింగ్ స్టోన్ 15 బంతుల్లో 25 పరుగులు (2 సిక్స్‌లు) చేసి ఔటయ్యాడు, చివరిలో జితేష్ శర్మ 10 బంతుల్లో 24 పరుగులు (2 ఫోరులు, 2 సిక్స్‌లు) చేసి ఔటయ్యాడు, రోమారియో షెఫర్డ్ 9 బంతుల్లో 17 పరుగులు (1 ఫోర్, 1 సిక్స్) చేసి ఔటయ్యాడు, కృనాల్ పాండ్య 5 బంతుల్లో 4 పరుగులు, భువనేశ్వర్ 2 బంతుల్లో 1 పరుగు చేసి వెనుదిరిగారు, యాష్ దయాల్ 1 బంతిలో 1 పరుగు చేసి నాటౌట్ గా నిలిచాడు. దీంతో రాయ‌ల్‌ ఛాలెంజర్స్ బెంగుళూరు 20 ఓవర్లు ముగిసే సమయానికి 9 వికెట్లు కోల్పోయి 190 పరుగులు చేశారు. పంజాబ్ కింగ్స్ బౌలింగ్ విషయానికి వస్తే అర్షదీప్ సింగ్ 3 వికెట్లు, జామీసన్ 3 వికెట్లు, అజ్మతుల్లా, వైషాక్ విజయకుమార్, చాహల్ చెరొక వికెట్ తీసుకొని బెంగుళూరుని 200 పరుగుల లోపే కట్టడిచేసారు.


తర్వాత బ్యాటింగుకు దిగిన పంజాబ్ కింగ్స్ ఓపెనర్స్ ప్రియాంష్ ఆర్య 19 బంతుల్లో 24 పరుగులు (4 ఫోరులు), ప్రభ్ సిమ్రాన్ సింగ్ 22 బంతుల్లో 26 పరుగులు (2 సిక్స్‌లు) చేసి వెనుదిరిగారు, పంజాబ్ కింగ్స్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్స్ విషయానికి వస్తే జోష్ ఇంగ్లిష్ 23 బంతుల్లో 39 పరుగులు (1 ఫోర్, 4 సిక్స్‌లు) చేసి ఔటయ్యాడు, పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ 2 బంతుల్లో 1 పరుగు చేసి ఔటయ్యాడు, నెహాల్ వధేరా 18 బంతుల్లో 15 పరుగులు (1 సిక్స్) చేసి అవుట్ అయ్యి వెనుదిరిగాడు, శశాంక్ సింగ్ 30 బంతుల్లో 61 పరుగులు (3 ఫోరులు, 6 సిక్స్‌లు) చేసి నాటౌట్ గా నిలిచాడు, మార్కస్ స్టోయినిస్ 2 బంతుల్లో 6 పరుగులు (1 సిక్స్) చేసి ఔటయ్యాడు, అజ్మతుల్లా 2 బంతుల్లో 1 పరుగు చేసి ఔటయ్యాడు, జామీసన్ 2 బంతులు ఆడి పరుగులు ఏమి చేయకుండా నాటౌట్ గా నిలిచాడు. దీంతో పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లు ఆట ముగిసే సమయానికి 7 వికెట్లు కోల్పోయి 184 పరుగులు చేసింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు బౌలింగ్ విషయానికి వస్తే భువనేశ్వర్ కుమార్ 2 వికెట్లు, కృనాల్ పాండ్య 2 వికెట్లు, యాష్ దయాల్, జోష్ హాజలీవూడ్, రోమారియో షెఫర్డ్ చెరొక వికెట్ తీసుకున్నారు.


దీంతో ఈ మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు 6 పరుగులతో గెలిచి ఈ ఏడాది ఐపీఎల్ 2025 ఛాంపియన్స్ గా నిలిచారు. 17 ఏళ్ళ తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు ఈ ఘనత సాధించింది. కాగా ఈ మ్యాచ్ కు సంబంధించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు బౌలర్ కృనాల్ పాండ్య నిలిచాడు.

Related News

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD